గాయత్రీ తంత్రం | Gayatri Tantram | గాయత్రీ తంత్రం |  Gayatri Tantram | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

గాయత్రీ తంత్రం
 Gayatri Tantram 
Rs 200/-

   ఈ విశ్వంలో అత్యంత శక్తిమంతమైనది శబ్దం. మన రుషులు ఈ శబ్ద శాస్త్రం(ఫొనోటిక్స్‌)లో నిష్ణాతులు. మనకు వారసత్వంగా వచ్చిన మంత్రాల వెనక పెద్ద శాస్త్రం దాగి ఉంది. ఈ మంత్రాలను ఉచ్ఛరించే సమయంలో వచ్చే శబ్దంలో శక్తి దాగి ఉంటుంది. దీనిని మనం ఇంకో కోణం నుంచి కూడా విశ్లేషించవచ్చు. ఏదైనా వస్తువు వేగంగా తిరుగుతున్నప్పుడు దాని నుంచి శబ్దం వెలువడుతుంది. ఇదే విధంగా గ్రహాలు కక్షలో తిరుగుతున్నప్పుడు శబ్దం వెలువడుతుంది. గెలాక్సీల చుట్టూ సౌరవ్యవస్థలు వేగంగా తిరుగుతున్నప్పుడు శబ్దం ఏర్పడుతుంది. ఈ శబ్దాలకు అపారమైన శక్తి ఉంటుంది. వీటిని సామాన్యులు వినలేరు. ఓం అనే శబ్దం సౌరవ్యవస్థలు తిరిగినప్పుడు ఏర్పడే శబ్దానికి సరిసమానంగా ఉంటుంది. విశ్వామిత్రుడు ఈ శబ్దాన్ని కనిపెట్టాడని చెబుతారు. విశ్వమిత్రుడు రూపొందించిన మరొక మంత్రం-గాయత్రి.
ఓం బుహుర్‌, బువహ, సువహ
తత్వవితుర్వరేణ్యం
భర్గో దేవశ్య దీమహి
ధీయోయోన ప్రచోదయాద్‌- అనే ఈ మంత్రం వెనక శాసీ్త్రయ అంశాలను ఆధ్యాత్మికవేత్తలు చెబుతూ ఉంటారు. మొదటి వాక్యానికి అర్థాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. బుహుర్‌ అంటే భూమి. బువహ అంటే ఈ సూర్యుడు కేంద్రబిందువుగా ఉన్న మన విశ్వం. సువహ అంటే మనకు సుదూరంలో ఉన్న కోట్లాది విశ్వాలు. ఇవన్నీ తిరుగుతున్నప్పుడు ఏర్పడే శబ్దమే ఓం. ఇక రెండో వాక్యం విషయానికి వస్తే- తత్‌ అంటే భగవంతుడు. సవితుర్‌ అంటే ఆ భగవంతుడు సూర్యుడి రూపంలో ఉన్నాడు. వరేణ్యం అంటే అలాంటి భగవంతుడికి ప్రణామాలు అర్పిద్దాం అని అర్థం. ఇక మూడో వాక్యానికి వస్తే- భర్గో అంటే కాంతి అని అర్ధం. దేవశ్య అంటే కాంతి రూపంలో ఉన్న దేవుడిని.. ధీమహి అంటే ధ్యానం చేద్దాం అని అర్థం. నాలుగో వాక్యంలో ధీయో అంటే మా మేధను యో అంటే ఆ భగవంతుడు ప్రచోదయాత్‌ అంటే సరైన మార్గంలో ప్రయాణించేలా మార్గం చూపించుగాక.. అని అర్థం

ఈ సందేహమే ఒకసారి వశిష్ఠ మహర్షికి వచ్చింది. వెంటనే విధాత వద్దకు వెళ్ళి గాయత్రీ తత్త్వాన్ని తెలుపని వేడుకోగా, ‘నా, స్ఫురణ మాత్రంగా ఏ చైతన్యశక్తి ఉత్పన్నమయిందో, దానినే జ్ఞానము లేక వేదముగా చెప్పుకోవచ్చు. దీనినే గాయత్రి నామంతో వ్యవహరిస్తారు. నా నుండి అగ్ని. అగ్ని నుం...డి వాయువు, వాయువు నుండి ఓంకారం, ఓంకారంతో హృతి, హ్రుతితో వ్యాహృతి, వ్యాహృతితో గాయత్రి, గాయత్రితో సావిత్రి, సావిత్రితో వేదాలు, వేదాలలో సమస్త క్రియలు ప్రవర్తిమవుతుదిన్నాయి’ అని బ్రహ్మ తెలియజేశాడు.
గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న 24 దేవతా శక్తులు.
గాయత్రీ మంత్రంలోని 24 దేవతలు, వారి చైతన్య శక్తులు:
01. వినాయకుడు: సఫలత్వ శక్తికి అధిపతి.విఘ్ననాయకుడైన వినాయకుడు బుద్ధినీ, జ్ఞానాన్నీ ప్రసాదిస్తాడు.
02. నృసింహ స్వామి: పరాక్రమ శక్తికి అధిపతి, పురుషార్థ, పరాక్రమ, వీరత్వ విజయాలను ప్రసాదించేది ఈయనే.
03. విష్ణుమూర్తి: పాలనాశక్తికి అధిష్ఠాత అయిన విష్ణు సర్వజీవ రక్షకుడు.
04. ఈశ్వరుడు: సకల జీవులకూ ఆత్మ పరాయణత్వాన్ని సర్వవిధ కల్యాణ శక్తులనూ ప్రసాదించే దయామయుడు.
05. శ్రీకృష్ణుడు: యోగ శక్తికి అధిష్ఠాత అయిన కృష్ణ భగవానుడు ప్రాణులకు కర్మయోగ ఆత్మనిష్ఠలను, వైరాగ్య, జ్ఞాన, సౌందర్యాదులును ప్రసాదిస్తాడు.
06. రాధాదేవి: ఈమె ప్రేమ శక్తికి అధిష్ఠాత్రి, భక్తులకు నిజమైన ప్రేమ భావాన్ని కలుగజేసి అసూయద్వేష భావాలకు దూరం చేస్తుంది.
07. లక్ష్మీదేవి: ధన వైభవ శక్తులకు అధినేత్రి. సకల లోకానికీ ఐశ్వర్యం, సంపద, పదవి, వైభవం, ధనం, యశస్సులను పుష్కలంగా అందిస్తుంది.
08. అగ్నిదేవుడు: తేజోశక్తికి అధినేత అయిన ఈయన ప్రకాశం, శక్తి, తేజస్సు శక్తి సామార్ధ్యాలను ప్రాసాదిస్తాడు.
09. మహేంద్రుడు: రక్షాశక్తికి అధిష్ఠాత, అనారోగ్యాలు, శతృభయాలు, భూత ప్రేతాదులు నుండి రక్షిస్తాడు.
10. సరస్వతి: విద్యా ప్రదాత. జ్ఞానాన్ని, వివేకాన్ని, బుద్ధిని ప్రసాదిస్తుంది.
11. దుర్గాదేవి: దమన శక్తికి అధిష్ఠాత్రి. అన్ని బాధలనూ తొలగించి, శత్రువుల బారి నుండి కాపాడుతూ సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది.
12. ఆంజనేయుడు: నిష్ఠాశక్తికి ఉపకారి హనుమంతుడు. తన భక్తులకు భక్తి, నిష్ఠ, కర్తవ్య పరాయణ తత్వం, బ్రహ్మచర్య పాల నాశక్తి ప్రసాదిస్తాడు.
13. భూదేవి: ధారణాశక్తికి అధినేత్రి. సకల ప్రాణకోటికి క్షమాశీలత్వాన్ని, ధైర్యాన్ని, దృఢత్వాన్ని, నిరంతరత్వాన్ని ప్రసాదిస్తుంది.
14. సూర్య భగవానుడు: ప్రాణశక్తికి అధిపతి. ఆరోగ్యాన్ని,సుదీర్ఘ జీవనాన్ని, ప్రాణశక్తికి, వికాసాన్ని, తేజస్సును ప్రసాదిస్తాడు.
15. శ్రీరాముడు: ధర్మం, శీలం, సౌమ్యత, మైత్రి, ధీరత్వం లాంటి గుణాలకు ప్రతీక. మర్యాదాశక్తికి అధిష్ఠాత ఈయన.
16. సీతాదేవి: తపశ్శక్తి అధిష్ఠాత్రి. అనన్య భావాలతో భక్తులను తపోనిష్ఠులుగా తయారుచేసి, అధ్యాత్మికోన్నత మార్గానికి ప్రేరేపించేదీమె.
17. చంద్రుడు: శాంతి శక్తికి అధిష్ఠాత. చింత శోకం, క్రోధం, మోహం, లోభం వంటి మానసిక వికారాలను అణిచివేసి శాంతిని ప్రసాదిస్తాడు.
18. యముడు: కాలశక్త్యాదిస్థాత. మృత్యువునకు భయపడకుండా సకల జనులను సమాయత్తం చేసేవాడు.
19. బ్రహ్మ: సకల సృష్టికి అధిష్ఠాత.
20. వరుణుడు: భావుకత్వాన్ని, కోమలత్వాన్ని, దయాళుత్వాన్ని, ప్రసన్నతను, ఆనందాన్ని అందిస్తాడు.
21. నారాయణుడు: ఆదర్శ శక్తికి అధిష్ఠాత. నిర్మలత్వాన్ని ప్రసాదిస్తాడు.
22. హయగ్రీవుడు: సాహన శక్తికి అధిష్ఠాత. ఉత్సాహాన్ని, సాహసాన్ని ప్రసాదిస్తాడు.
23. హంస: వివేక శక్తికి అధిష్ఠాత్రి. హంస క్షీరనీరవివేక జగత్ ప్రసిద్ధమైంది.
24. తులసీ మాత: సేవాశక్తికి అధిష్ఠాత్రి. ఆత్మశాంతి, దుఃఖ నివారణ వంటి ఫలాలను ప్రసాదిస్తుంది.
శ్రీ గాయత్రీ మాత మహాత్యం
వాల్మీకి రామాయణానికి మూలాధారం గాయత్రీ మంత్రమే. గాయత్రీ మహామంత్రానికి వ్యాఖ్యాన రూపంలో ఈ మహాకావ్య రచన జరిగిందని అంటారు.
ఓమ్ భూర్భువ స్వః ఓమ్తత త్సవితుర్వరేణ్యమ్
భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్
ఇదే గాయత్రీ మూల మంత్రం. గాయత్రిని మించిన మంత్రం లేదు. తల్లిని మించిన దైవం లేదు.
త్రికాలలలోనూ గాయత్రీ మంత్రాన్ని అనుష్ఠించటం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఆరోగ్యం, సంకల్ప బలం, ఏ కాగ్రత, ఇంద్రియాలపై అదుపు సాధించటానికి ఈ మంత్రం ఉపయోగపడుతుందని మన ప్రాచీన రుషులు చెబుతున్నారు. అటువంటి గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం, గాయత్రీదేవిని మించిన దైవం మరెవరూ లేరన్నది అక్షర సత్యం. హిందూ ధర్మ శాస్త్రాల్లో ఆత్మశక్తిని ప్రసాదించే మంత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ, వాటన్నింటిలో గాయత్రీ మంత్రం సర్వ శ్రేష్ఠమైనది. నాలుగు వేదాలలో గాయత్రిలో సమానమైన మంత్రం ఏదీ లేదని విశ్వామిత్రుడు చెబుతాడు. ప్రతి నిత్యం నియమ నిష్ఠలతో గాయత్రిని ధ్యానించలేని, ఉపాసించలేని వారు గాయత్రీ మంత్రాన్ని త్రికాలలోనూ పదిసార్లు చొప్పున జపిస్తే చాల మంచిది. ఏ పనిలో ఉన్నప్పటికీ చేస్తున్న పనిని కాసేపు ఆపి, కాళ్ళకు ఉండే పాదరక్షలను వదిలిపెట్టి ఈ మంత్ర జపం చేయువచ్చు. గాయత్రీ మంత్రాన్ని జపం చేస్తే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. గాయత్రీ మంత్రంతో పాటుగా ప్రతి ఒక్కరూ ‘ఓం నమో గాయత్రీ మాత్రే’ అని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపిస్తే తప్పక సత్ఫలితాలను పొందుతారు. శ్రీ గాయత్రీ మాత అనుగ్రహం తప్పక లభిస్తుంది.
బ్రాహ్మీ ముహూర్తకాలంలో ప్రకృతిలో చేతనాశక్తి పరుచుకుంటున్నవేళ, నిర్మల నదీ తరంగాలు వేదనాదంలా తరంగించే వేళ అపూర్వ తేజోవిరాజితుడైన మునిసత్తుముని కంఠంలో నుండి వెలువడిన సుస్వర మంత్రర్పరి, సృష్టి ఉత్పత్తి, వర్తన, పోషణాలను నిర్దేశించిన అద్భుత చంధో తరంగం గాయత్రీ మంత్రం. ఆ రుషి సత్తముడు మరెవరో కాదు. సృష్టికి ప్రతిసృష్టి చేసిన అపూర్వ తపోబల సంపన్నుడు విశ్వామిత్ర మహర్షి. ఆ మహారుషి తపశ్శక్తిలోంచి వెలువడిన మంత్రమే ఇది.
* గాయత్రి మంత్రాక్షరాలు
సహస్ర పరమాం దేవీం శతమధ్యాం దళవరాం
సహస్ర నేత్రాల గాయత్రీం శరణ మహం ప్రపద్యే
‘న గాయత్ర్యా నరం మంత్రం న మాతుః పర దైవతమ్’
గాయత్రీ మంత్రం అన్ని మంత్రాలలోకెల్లా శ్రేష్ఠమైనది. తల్లిని మించిన దైవం, గాయత్రిని మించిన దైవం లేదు. ‘గయాన్ త్రాయతే ఇతి గాయత్రీ.’ శంకరుని భాష్యం ప్రకారం ప్రాణాన్ని రక్షించేది గాయత్రి. అంటే ఒక స్వతంత్రమైన దేవి, దేవత కాదు. పరబ్రహ్మ పరమాత్మల క్రియాభాగం గాయత్రి. బ్రహ్మయే గాయత్రి. గాయత్రే బ్రహ్మమని శతపథ బ్రాహ్మణం చెబుతోంది. పరమశివుడు బ్రహ్మానందంలో తన డమరుకం చేసిన 24 ధ్వనులే శ్రీ గాయత్రీ మంత్రంలోని 24 అక్షరాలు. ఈ 24 అక్షరాలే 24 దైవిక శక్తులకు ప్రతీకలు. వీటికి 24 పేర్లు ఉన్నాయి. వీటిలో 12 వైదిక మార్గాలు కాగా, 12 తాంత్రిక మార్గాలు. ఈ 24 అక్షరాలు నివాసం ఉంటే 24 దైవశక్తులు ఆయా పేర్లతో పూజింపబడతాయి. గాయత్రి మంత్రాన్ని అనన్య భక్తితో పఠించేవారిని ఆ 24 శక్తులు సర్వవేళలా కాపాడుతాయి.

తంత్ర చూడామణి:
     51 శక్తిపీఠాల మూల పాఠం


      ఇది పీఠ నిర్ణయః లేదా మహా పీఠ నిరూపణమ్ అని పిలువబడే తంత్ర చూడామణిలో 51 శక్తిపీఠాల మూల పాఠం. దీనిని శబ్దకల్పద్రుమమునుండి గ్రహించాము. శక్తి పీఠాల గురించిన పరిశోధన చేసేవారికి బహుధా ఉపకరించగలదని మా భావన.


శ్రీ గణాధిపతయే నమ:
మహా పీఠ నిరూపణమ్ |
ఏకపంచాశత్ శక్తిపీఠాని ||
కృతయుగే దక్షక్రతౌ శివనిందాం శ్రుత్వా ప్రాణాంస్త్యక్తవత్యా: సత్యా: శరీరం శిరసి ధృత్వా భ్రమతి శివే విష్ణునా చక్రేణ ఛిన్నాస్తస్యా అవయవా: యత్ర యత్ర పతితాస్త ఏవ దేశా: ఏకపంచాశన్మహాపీఠా: అభవవన్| ఇతి పౌరాణికీ వార్తా|
తేషాం నిరూపణం యథా|
ఈశ్వర ఉవాచ|
1. మాత: పరాత్పరే! దేవి! సర్వజ్ఞానమయీశ్వరి!|
కథ్యతాం మే సర్వపీఠం శక్తీర్భైరవదేవతా:||
దేవ్యువాచ|
2. శృణు వత్స! ప్రవక్ష్యామి దయాళో! భక్తవత్సల!|
యాభిర్వినా న సిధ్యన్తి జపసాధనసత్క్రియా:||
3. పంచాశదేకపీఠాని ఏవం భైరవదేవతా:|
అంగప్రత్యంగపాతేన విష్ణుచక్రక్షతేన చ||
4. మమాన్యవపుషో దేవ! హితాయ త్వయి కథ్యతే|
1)బ్రహ్మరంధ్రం హింగుళాయాం భైరవో భీమలోచన:||
5. కోట్టరీ సా మహామాయా త్రిగుణా సా దిగంబరీ|
2)శర్కరారే త్రినేత్రం మే దేవీ మహిషమర్దినీ||
6. క్రోధీశో భైరవస్తత్ర సర్వసిధ్ధిప్రదాయక:|
3)సుగంధాయాం నాసికా మే దేవస్త్ర్యంబకభైరవ:||
7. సుందరీ సా మహాదేవీ సునందా తత్ర దేవతా|
4)కాశ్మీరే కంఠ​దేశశ్చ త్రిసంధ్యేశ్వరభైరవ:||
8. మహామాయా భగవతీ గుణాతీతా వరప్రదా|
5)జ్వాలాముఖ్యాం మహాజిహ్వా దేవ ఉన్మత్తభైరవ:||
9. అంబికా సిద్ధిదానామ్నీ 6)స్తనం జాలంధరే మమ|
భీషణో భైరవస్తత్ర దేవీ త్రిపురమాలినీ||
10. 7)హార్దపీఠం వైద్యనాథే వైద్యనాథస్తు భైరవ:|
దేవతా జయదుర్గాఖ్యా 8)నేపాలే జానునీ మమ||
11. కపాలీ భైరవ: శ్రీమాన్ మహామాయా చ దేవతా|
9)మానసే దక్షహస్తో మే దేవీ దాక్షాయణీ హర||
12. అమరో భైరవస్తత్ర సర్వసిద్ధిప్రదాయక:|
10)ఉత్కళే నాభిదేశశ్చ విరజాక్షేత్రముచ్యతే||
13. విమలా సా మహాదేవీ జగన్నాథస్తు భైరవ:|
11)గండక్యాం గండపాతశ్చ తత్రసిద్ధిర్నసంశయ:||
14. తత్ర సా గండకీచండీ చక్రపాణిస్తు భైరవ:|
12)బహుళాయాం వామబాహుర్బహుళాఖ్యా చ దేవతా||
15. భీరుకో భైరవోదేవ: సర్వసిద్ధిప్రదాయక:|
13)ఉజ్జయిన్యాం కూర్పరం చ మాంగళ్య: కపిలాంబర:||
16. భైరవ: సిద్ధిద: సాక్షాద్దేవీ మంగళచండికా|
14)చట్టలే దక్షబాహుర్మే భైరవశ్చంద్రశేఖర:||
17. వ్యక్తరూపా భగవతీ భవానీ తత్ర దేవతా|
విశేషత: కలియుగే వ​సామి చంద్రశేఖరే||
18. 15)త్రిపురాయాం దక్షపదో దేవతా త్రిపురా మతా|
భైరవస్త్రిపురేశశ్చ సర్వాభీష్టఫలప్రద:||
19. 16)త్రిస్రోతాయాం వామపాదో భ్రామరీ భైరవో2ంబర:|
17)యోనిపీఠం కామగిరౌ కామాఖ్యా తత్ర దేవతా||
20. యత్రాస్తే త్రిగుణాతీతా రక్తపాషాణరూపిణీ |
యత్రాస్తే మాధవ: సాక్షాత్ ఉమానందో2థ భైరవ:||
21. సర్వదా విహరేద్దేవీ తత్ర ముక్తిర్నసంశయ:|
తత్ర శ్రీభైరవీ దేవీ తత్ర చ క్షేత్ర దేవతా||
22. ప్రచండచండికా తత్ర మాతంగీ త్రిపురాంబికా|
బగళా కమలా తత్ర భువనేశీ సధూమినీ||
23. ఏతాని వరపీఠాని శంసన్తి వరభైరవ!|
ఏవం తా దేవతా: సర్వా ఏవం తే దశ భైరవా:||
24. సర్వత్ర విరలా చాహం కామరూపే గృహే గృహే|
గౌరీశిఖరమారుహ్య పునర్జన్మ న విద్యతే|
25. కరతోయాం సమాసాద్య యావత్ శిఖరవాసినీమ్|
శతయోజనవిస్తీర్ణం త్రికోణం సర్వసిద్ధిదమ్|
26. దేవా మరణమిచ్ఛన్తి కిం పునర్మానవాదయ:||
18)భూతధాత్రీ మహామాయా భైరవ: క్షీరఖండక:|
27. యుగాద్యాయాం మహాదేవ! దక్షాంగుష్ఠం పదో మమ||
19)నకులీశ: కాళీపీఠే దక్షపాదాంగుళీషు చ|
28. సర్వసిద్ధికరీదేవీ కాళికా తత్ర దేవతా||
20)అంగుళీషు చ హస్తస్య ప్రయాగే లలితా భవ|
29. 21)జయంత్యాం వామజంఘా చ జయంతీ క్రమదీశ్వర:||
22)భువనేశీ సిద్ధిరూపా కిరీటస్థా కిరీటత:|
30. దేవతా విమలానామ్నీ సంవర్తో భైరవస్తథా||
23)వారణాస్యాం విశాలాక్షీ దేవతా కాలభైరవ:|
31. మణికర్ణేతి విఖ్యాతా కుండలం చ మమ శ్రుతే:||
24)కన్యాశ్రమే చ పృష్ఠం మే నిమిషో భైరవస్తథా|
32. సర్వణీ దేవతా తత్ర 25)కురుక్షేత్రే చ గుల్ఫత:||
స్థాణుర్నామ్నా చ సావిత్రీ దేవతా 26)మణివేదకే|
33. మణిబంధే చ గాయత్రీ సర్వానందస్తు భైరవ:||
27)శ్రీశైలే చ మమ గ్రీవా మహాలక్ష్మీస్తు దేవతా|
34. భైరవ: శంబరానన్దో దేశే దేశే వ్యవస్థిత:||
28)కాంచీదేశే చ కంకాళీ భైరవో రురునామక:|
35. దేవతా దేవగర్భాఖ్యా 29)నితంబ: కాలమాధవే||
భైరవశ్చాసితాంగశ్చ దేవీ కాళీ చ ముక్తిదా|
36. దృష్ట్వా దృష్ట్వా మహాదేవ! మంత్ర​సిద్ధిమవాప్నుయాత్||
కుజవారే భూతతిథౌ నిశార్ధే యస్తు సాధక:|
37. నత్వా ప్రదక్షణీకృత్య మంత్ర​సిద్ధిమవాప్నుయాత్||
30)శోణాఖ్యా భద్రసేనస్తు నర్మదాఖ్యే నితంబక:|
38. 31)రామగిరౌ స్తనాన్యం చ శివానీ చణ్డ​భైరవ:||
32)బృందావనే కేశజాలే ఉమానామ్నీ చ దేవతా|
39. భూతేశో భైరవస్తత్ర సర్వసిద్ధిప్రదాయక:||
33)సంహారాఖ్య ఊర్ధ్వదంతే దేవీ నారాయణీ శుచౌ|
40. 34)అధోదంతే మహారుద్రో వారాహీ పంచసాగరే||
35)కరతోయాతటే తల్పం వామే వామనభైరవ:|
41. అపర్ణా దేవతా తత్ర బ్రహ్మరూపా కరోద్భవా||
36)శ్రీపర్వతే తల్పం తత్ర శ్రీసుందరీ పరా|
42. సర్వసిద్ధికరీ సర్వా సుందరానంద​భైరవ:||
37)కపాలినీ భీమరూపా వామగుల్ఫో విభాసకే|
43. 38)ఉదరం చ ప్రభాసే మే చంద్రభాగా యశస్వినీ||
39)వక్రతుండో భైరవశ్చోర్ధ్వోష్ఠో భైరవపర్వతే|
44. అవంతీ చ మహాదేవీ లంబ​కర్ణస్తు భైరవ:||
40)చిబుకే భ్రామరీ దేవీ వికృతాక్షీ జలేస్థలే (జనస్థలే)|
45. 41)గండో గోదావరీతీరే విశ్వేశీ విశ్వమాతృకా||
దండ​పాణీర్భైరవస్తు వామగండే తు రాకిణీ|
46. అమాయో భైరవో వత్స! సర్వశైలాత్మకోపరి||
42)రత్నావళ్యాం దక్షస్కంధ​: కుమారీ భైరవ: శివ:|
47. 43)మిథిలాయాముమాదేవీ వామస్కంధో మహోదర​:||
44)నలాహాట్యాం నలాపాతో యోగేశో భైరవస్తథా|
48. తత్ర సా కాళికా దేవీ సర్వసిద్ధిప్రదాయికా||
45)కర్ణాటేచైవ కర్ణం మే అభీరుర్నామ భైరవ:|
49. దేవతా జయదుర్గాఖ్యా నానాభోగప్రదాయినీ||
46)వక్రేశ్వరే మన:పాతో వక్రనాథస్తు భైరవ:|
50. నదీ పాపహరా తత్ర దేవీ మహిషమర్దినీ||
47)యశోరే పాణిపద్మంచ దేవతా యశోరేశ్వరీ|
51. చండశ్చ భైరవో యత్ర తత్ర సిద్ధిమవాప్నుయాత్||
48)అట్టహాసే చోష్ఠపాతో దేవీ సా ఫుల్లరా స్మృతా|
52. విశ్వేశో భైరవస్తత్ర సర్వాభీష్టప్రదాయక:||
49)హారపాతో నందిపురే భైరవో నందికేశ్వర:|
53. నందినీ సా మహాదేవీ తత్ర సిద్ధిర్నసంశయ:||
50)లంకాయాం నూపురశ్చైవ భైరవో రాక్షసేశ్వర:|
54. ఇంద్రాణీ దేవతా తత్ర ఇంద్రేనారాధితా పురా||
51.)విరాట దేశమధ్యేతు పాదాంగుళినిపాతనమ్|
55. భైరవశ్చామృతాఖ్యశ్చ దేవీ తత్రాంబికా స్మృతా||
52?)మాగధే దక్షజంఘా మే వ్యోమకేశశ్చ భైరవ:|
56. సర్వానందకరీ దేవీ సర్వకామఫలప్రదా|
ఏతస్తే కథితా: పుత్ర! పీఠనాథాధిదేవతా:|
57. అజ్ఞాత్వా భైరవం పీఠం పీఠశక్తిం చ శంకర||
భైరవైర్హ్రియతే సర్వం జపపూజాది సాధనమ్|
58. అజ్ఞాత్వా భైరవం పీఠం పీఠశక్తించ శంకర||
ప్రాణనాథ​! న సిధ్యేత కల్పకోటి జపాదిభి:|
59. న దేయం పరశిష్యేభ్యో నిందకాయ దురాత్మనే||
శఠాయ వంచకాయేదం దత్వా మృత్యుమవాప్నుయాత్|
60. దద్యాత్ శాంతాయ శిష్యాయ నైష్ఠికాయ శుచౌ ప్రియే||
సాధకాయ కులీనాయ మంత్రీ మంత్రార్థ​సిద్ధయే||
ఇతి తంత్ర​చూడామణౌ శివపార్వతీ సంవాదే ఏకపంచాశత్ విద్యోత్పత్తౌ పీఠనిర్ణయ: సమాప్త:|


ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment