-యాప్‌లో డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ వంటి సర్టిఫికెట్ల నమోదుకు అవకాశం

-ఒరిజినల్స్‌ను వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేదు

-ఈ మేరకు రాష్ర్టాలకు కేంద్రం ఆదేశం

-డిజి లాకర్‌లోని పత్రాలను పరిగణనలోకి తీసుకోవాలంటూ రాష్ర్టాలకు కేంద్రం నోటిఫికేషన్

-పోలీసులు వాహనాన్ని ఆపినప్పుడు డిజిలాకర్‌లోని పత్రాలు చూపిస్తే చాలు

     న్యూఢిల్లీ: ఇక మీదట బయటకు వెళ్లినప్పుడు మీ వెంట తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇన్స్యూరెన్స్ కాగాతాలు తీసుకెళ్లకపోయినా ఫర్వాలేదు. ఎందుకంటే వాటిని డిజిలాకర్‌లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పటివరకూ డిజిలాకర్‌లో వాహనాలకు సంబంధించి ఎటువంటి పత్రాలను చూపించినా పోలీసులు అంగీకరించలేదు. దీంతో కొందరు కేంద్ర రవాణా శాఖకు ఫిర్యాదులు చేశారు. ఇప్పటికే బీహార్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాల్లో డిజిలాకర్‌లో ఉన్న పత్రాలను లీగల్ డాక్యుమెంట్లుగా పరిగణిస్తున్నారని, మిగతా చోట్ల పోలీసులు అంగీకరించడం లేదని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. దీంతో స్పందించిన కేంద్ర రవాణా శాఖ డిజిలాకర్‌లోని పత్రాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించింది. వాహనదారులు తమ వాహనాలకు సంబంధించిన ఏ పత్రాలనైనా డిజిలాకర్ యాప్ లేదా ఎంపరివాహన్ మొబైల్ యాప్‌లో భద్రపరుచుకోవచ్చు. ట్రాఫిక్ పోలీసులు వాహనాలను ఆపినప్పుడు ఒరిజినల్ పత్రాలకు బదులు డిజిలాకర్‌లో ఉన్న వాటిని చూపిస్తే సరిపోతుంది. కేంద్ర రవాణా శాఖ ఆదేశాల ప్రకారం ఈ నిబంధన శుక్రవారం నుంచే అమల్లోకి వస్తుంది. డిజిటల్ ఇండియాలో భాగంగా ప్రధాని మోదీ ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment