నేనున్నాను | Nenunnanu | Puranapanda Srinivas | Mohanpublications | BhakthiBooks | BhaktiBooks | Telugu Books | Book Publishers in Rajahmundry | Mohan Publicartions Rajahmundry | Mohan Publications Books in Rajahmundry |

Nenunnanu

'యుగే యుగే' (2013) , 'పసుపు-కుంకుమ' (2014), 'శరణు శరణు' (2014), 'అమ్మణ్ణి' (2015), 'పచ్చ కర్పూరం' (2016), 'అమృతమస్తు' (2017), 'మహా మంత్రస్య' (2017) వంటి అపురూప పవిత్ర గ్రంధాలను అమృతధారలుగా సలక్షణంగా అందించిన ప్రముఖ రచయిత, అనేక గ్రంధాల రచనా సంకలనకర్త పురాణపండ శ్రీనివాస్అందించిన ఆంజనేయ భగవానుని మహా గ్రంధం - ' నేనున్నాను '.

భారతీయ సనాతన హైందవ ధర్మంలో ఇంత వరకూ తెలుగులో హనుమంతునిపై ఇలాంటి అద్భుత గ్రంథం వెలువడలేదనే చెప్పాలి.

చరిత్ర గతిలో అనేక కాలాలలో అనేక మూర్తులుగా ఆంజనేయ స్వామిని, విభిన్న సంప్రదాయాల వారు కొలుచుకుంటున్న అనేక రీతులు ఈ అద్భుత గ్రంథం లో అనేక చోట్ల అపూర్వంగా ప్రస్తావించారు.

సర్వకర్మలకి బలాన్నిచ్చి, ఫలాన్నిచ్చే హనుమంతునిపై అనేక చోట్ల పురాణపండ శ్రీనివాస్ అందించిన వ్యాఖ్యాన వైఖరీ దక్షతలోని శబ్ద ప్రయోగాల ఆత్మ ధ్వనుల అందాలు మనల్ని పరవశింపజేస్తాయి.

అత్యంత నాణ్యతా ప్రమాణాలతో ఒక అఖండ ఆత్మచైతన్యంలా మంత్ర సమూహాలతో అందిన ఈ గ్రంథం లో సుమారు ఐదు వందలకు పైబడిన అతి అరుదైన ఆంజనేయుని శిల్ప చిత్రాలు, వర్ణ చిత్రాలు, రేఖా చిత్రాల పరిమళం ఇచ్చే అనుభూతి అత్యంత శక్తివంతంగా గోచరిస్తుంది. ఈ చిత్రాల సౌమ్యత, తీక్ష్ణత, ప్రశాంతత, ప్రచండత సమ్మోహింప జేస్తాయి.

సాధకునికి అక్షయ ధైర్యాన్నిచ్చే'నేనున్నాను' భారీ మంగళ గ్రంథం, భక్త మానవాళికి 'వారాహి సంస్థ' అధినేత సాయి కొర్రపాటి అందించిన మహోన్నత వరం. వ్యాపార విలువలకు దూరంగా నిండు భక్తికి పట్టం కట్టిన ఈ అపురూప గ్రంథం ఇంటింటా ఉండాల్సిన పుస్తకం.


నేనున్నాను | Nenunnanu | Puranapanda Srinivas | Mohanpublications | BhakthiBooks | BhaktiBooks | Telugu Books | Book Publishers in Rajahmundry | Mohan Publicartions Rajahmundry | Mohan Publications Books in Rajahmundry |

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

1 comment:

  1. నమస్తే. ఈ ' నేనున్నాను' అపురూప గ్రంధాన్ని తెలుగు చలన చిత్ర సీమ కదానాయకులు నందమూరి బాలకృష్ణ గారు తమ చేతుల మీదుగా కృష్ణా జిల్లా కమ్మ సంఘం మిత్రులకు బహుమానంగా యిచ్చారు. యింతవరకు తెలుగులో ఇలాంటి ఆంజనేయ స్వామి గ్రంధాన్ని చూడలేదు. చదవలేదు. ఈ పుస్తకం చుసేకొద్దీ ఏదో తెలియని ధైర్యం, శక్తి మమ్మల్ని ఆవహించాయి. శ్రీ పురాణపండ శ్రీనివాస్ గారి జీవితంలో యిదొక మైలురాయి గా నిలిచి పోతుంది. సుమారు ఐదువందల ఆంజనేయ స్వామి రంగు రంగుల అరుదైన ఫోటోస్ సుపర్బ్ సార్. ఎన్నెన్ని మంత్రాలు, స్తోత్రాలు ... రియల్లీ సూపర్బ్, హాట్సాఫ్.

    ReplyDelete